ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసులో (AP Skill Development Case) మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 12 మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించాలని సీఐడీకి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలన్నారు. అజయ్ కల్లం రెడ్డి, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మీ, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జీ.జయలక్ష్మిని విచారించాలని ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Raghuramakrishna Raju: వైసీపీ పాలనలో అవినీతి..హైకోర్టులో పిల్ చేసిన ఆ పార్టీ ఎంపీ..!
ప్రస్తుత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, అప్పటి సీఎండీ బంగారు రాజుతో పాటు కార్పొరేషన్ లోని సీఎఫ్ఓ, సీఈవో, ఈడీలను విచారించాలని ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్, చెక్ పవర్ తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారుల్ని కూడా విచారించాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు న్యాయవాది ప్రసాద్. ఈ ఫిర్యాదుపై సీఐడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రసాద్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? అన్న అంశం ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి: Chandrababu New Case: ఏ2గా చంద్రబాబు.. ఏపీ సీఐడీ మరో కేసు
ఇదే కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని (AP Ex CM Chandrababu) సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు.