/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-10.jpg)
Bus Accident: ఏపీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం దగ్గర అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. 50 మందికి పైగా ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి కాలువలోకి వెళ్లింది. విషయం గమనించిన స్థానికులు వెంటనే ప్రయాణికులను కాపాడారు. ప్రాణనష్టం ఏమీ లేకపోగా పలువురికి గాయాలయ్యాయి. వర్షం, అందులోనూ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆ బస్సు రాజమండ్రి డిపోకు చెందినదిగా పోలీసులు తెలిపారు.