AP Politics: గోదావరి జిల్లాలపై ప్రధాన పార్టీలు ఫోకస్..

ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా గోదావరి జిల్లాల మీద ఫోకస్‌ పెట్టాయి. ఇందులో భాగంగా కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది.

AP Politics: గోదావరి జిల్లాలపై ప్రధాన పార్టీలు ఫోకస్..
New Update

Ap Politics: ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల మీద ప్రధాన పార్టీలన్ని ఫుల్‌ ఫోకస్‌ పెట్టాయి. గోదావరి జిల్లాల్లో నిల్చోబెట్టాడానికి కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా లేరు. అయినప్పటికీ రెండు జిల్లాల మీద పట్టు సాధించాలని మంచి కసి మీద ఉన్నాయి. బలమైన అభ్యర్థులను పోటీ దించేందుకు కుల రాజకీయాలకు కూడా వెనుకాడుట లేదు.

ఇప్పటికే ఎక్కడ ఎలాంటి అభ్యర్థిని నిలబెడితే విజయం సాధిస్తాం అన్నదాని మీద కసరత్తులు మొదలుపెట్టాయి. జనసేన అధినేత కు పట్టు ఉన్న ఊర్ల మీద మీద ఫోకస్‌ పెట్టిన వైసీపీ..ఆయన మీద పోటీకి ఆ ప్రాంతీయ అభ్యర్థినే నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తెర మీదకు మెగా డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ పేరు వచ్చింది.

ఆయనను పవన్‌ పోటీ చేయాలనుకుంటున్న కాకినాడ నుంచి కానీ ఏలూరు నుంచి కానీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని వైసీపీ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌..కాకినాడ నుంచి ఎంపీ వంగా గీతా పిఠాపురం నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్‌ లుగా ప్రకటించారు.

Also read: స్థానిక భాషతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ యంగ్‌ లీడర్‌!

అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడో జాబితాలో తన పేరు కచ్చితంగా వస్తుందంటూ ఆశగా ఎదురు చూస్తున్న అనురాధ. కానీ ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మూడు పార్లమెంట్‌ స్థానాలకు కూడా ప్రధాన పార్టీలకు బలమైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు వెదుకులాట మొదలు పెట్టాయి.

రాజమండ్రి ఎంపీ భరత్‌ సిటీ ఇంఛార్జ్‌ గా రావడంతో మరో పార్లమెంట్‌ అభ్యర్థి కోసం వెతుకులాట మొదలైంది. అటు అమలాపురం పార్లమెంటులో కూడా చింతా అనురాధ పెద్దగా ఆశక్తి చూపకపోవటంతో మరో అభ్యర్థి కోసం వెదికే పనిలో పడింది వైసీపీ. మరోపక్క కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభంను పోటీ చేయించాలని పట్టు పడుతున్నట్లు సమాచారం. ఓ అసెంబ్లీ, ఓ రాజ్యసభ స్థానం ఆశిస్తున్న ముద్రగడ వర్గం. కానీ ఈ విషయం ఇంకా ఏ కొలిక్కి రాలేదు.

పవన్‌ అక్కడ నుంచే..

ఇప్పటికే కాకినాడ పార్లమెంట్‌ పై కన్నేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కొద్ది రోజుల క్రితం మూడు రోజుల పాటు కాకినాడలో పర్యటన ముగించుకుని వెళ్లిన జనసేనాని..మరో రెండు రోజుల్లో కాకినాడకు రానున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ కొత్తగా పార్లమెంట్‌ లో మరో అభ్యర్థిని బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తుంది. పవన్‌ కు పోటీగా సినీ పరిశ్రమ నుంచే మెగా దర్శకుడు వీవీ వినాయక్‌ ని పోటీకి దించుతున్నట్లు సమాచారం.

వీవీ వినాయక్‌ ది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చాగల్లు. కాకినాడ పార్లమెంట్‌ కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉండడంతో వినాయక్‌ మీద వైసీపీ కన్ను పడింది. ఆయన్ని ఏలూరు నుంచి కానీ కాకినాడ పార్లమెంట్ నుంచి కానీ బరిలో దించే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరి వీవీ వినాయక్‌ ప్రాంతీయ అభిమానం ఏ మేరకు పని చేస్తుందో వేచి చూడాలి.

#ycp #janasena #godavari-districts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe