ఏపీ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించడం... టీడీపీతో కలిసి మెలసి తిరుగుతుండడం.. అటు జగన్ ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతుండడం లాంటి పరిణామాలు ఊహించని విధంగా తక్కువ టైమ్‌లో జరిగిపోయాయి. ఇదే సమయంలో వారాహి యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. జగన్‌పై ఉన్న కేసులు ఎత్తివేస్తే.. కేంద్రంతో వారికి సత్సంబంధాలు ఉన్నట్లు భావించాలంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైపు చంద్రబాబుపై ఒక కేసు తర్వాత మరొ కేసు ఫైల్ అవుతుండగా.. మరోవైపు జగన్ కేసులు ఎత్తివేస్తే అంటూ పవన్ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నదానిపై సర్వత్రా చర్చ జరగుతోంది.
పవన్ ఇంకేం అన్నారంటే?
⦿ కైకలూరు, ముదినేపల్లి లో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉంది
⦿ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఎక్కువగా ఉంది
⦿ జీతాలు సరిగా లేవని మా జనవాణి లో చెప్పారు
⦿ ఐఎఎస్...ఐపీఎస్ లకు కూడా జీతాలివ్వలేని పరిస్థితి లో ప్రస్తుతం ఏపీ ఉంది.
⦿ రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నా...జీతాలు రాకపోయినా కూడా సీఎం కు జవాబుదారితనం లేదు .
⦿ కొద్ది రోజులుగా టీడీపీ పై కేసులు పెడుతున్నారు... జనసేన నాయకుల పై కూడా కేసులు పెడుతున్నారు.
⦿ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళాం..
⦿ మేము ఎవరితో పొత్తులు అనేది ప్రజలకు చెప్తామ్..
⦿ వైసీపీ కి మా పొత్తులు, మా స్థానాలు అవసరం లేదు
⦿ తెలంగాణ లో పసుపు బోర్డ్ కోరిక నెరవేరింది...
⦿ సీఎం జగన్ ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్లినా కూడా ఏపీ కి ఏమి సాధించలేకపోయారు
⦿ ఢిల్లీ వెళ్లి ఏమి మాట్లాడతారు ?
⦿ ప్రస్తుతం ఎన్డీయే లో ఉన్నాం...2014లో పోటీ చేసిన టీడీపీ-బీజేపీ -జనసేన కలిసి మళ్ళీ పోటీ చెయ్యలనేదే మా ఆకాంక్ష.
⦿ జీ20 జరుగుతున్న సమయంలో చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడం బాధాకరం.
⦿ వైసీపీ వ్యతిరేక ఓట్ కు కట్టుబడి ఉన్నాం కాబట్టే నేను టీడీపీతో కలిశాను
⦿ జీ20లో కేంద్ర నాయకత్వం బిజీ గా ఉంది.. కాబట్టే నేను వెళ్లి బాబు కు మద్దతు పలికి పొత్తు ప్రకటన చేశాను.
కేసుల చుట్టూ పవన్ స్పీచ్:
తమ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు పవన్ కళ్యాణ్. జనసేన నాయకులపై ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి కేసులు పెడుతున్నారన్నారు. బీజేపీ పొత్తు నుంచి వెళ్ళిపోయామని వైసీపీ ప్రచారం చేస్తుందని.. మా పోత్తులు, సీట్లు గురించి మాట్లాడటం వైసీపీకి రివాజుగా మారిపోయిందన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన కట్టుబడి ఉందన్నారు పవన్. 2021 నుంచి ప్రతిపక్ష ಓటు చీలకూడదని నిర్ణయం తీసుకున్నానని.. జీ20 జరుగుతున్న సమయంలో పథకం ప్రకారం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారన్నారు. ఢిల్లీతో సంప్రదించకుండా అప్పుడున్న పరిస్థితులు కారణంగా టీడీపీ కి మద్దత్తు ప్రకటించానని తెలిపారు. టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత మరింత శక్తివంతంగా ఇరు పార్టీల క్యాడర్ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు పవన్.
ALSO READ: చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వయాగ్రా లాంటివాడు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!