AP Politics: కూటమిలో కొట్లాట?.. పొత్తులో లుకలుకలు..!

టీడీపీ-జనసేన పొత్తుపై కొంత స్తబ్దత కనబడుతుందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తు ఎంత స్పీడ్‌గా కుదిరిందో.. అంతే స్పీడుగా రెండు పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. గతవారం నియోజకవర్గ ఆత్మీయ సమావేశాల్లో ఇరు పార్టీ నేతలు ఒకరికొకరు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

New Update
సీఎం పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.!

ఏపీ(AP)లో టీడీపీ(TDP) జనసేన(Janasena) కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ సమావేశాల్లో ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగడం పై పార్టీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వరస సమావేశాలను చెప్పిన టిడిపి జనసేన నేతలు... ఎవరికివారుగా విడివిడిగా పోరాటాలు ఎందుకు చేస్తున్నారు?.. 15 రోజులకు ఒకసారి సమావేశాలు, ఉమ్మడి మేనిఫెస్టో మీటింగ్ లు ఎందుకు జరగడం లేదు? టీడీపీ జనసేన కూటమికి సీట్ల లొల్లి వచ్చిందా? కూటమి బీటలు వారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం రీడ్ దిస్ స్టోరి...!

కలిసి పనిచేయడానికి సుముఖంగా లేని ఇరు పార్టీ నేతలు:
ఏపీలో అధికార పార్టీ గద్దించడమే లక్ష్యంగా ఏర్పాటైన టిడిపి జనసేన కూటమి ఊహించిన విధంగా ముందుకు సాగడం లేదు. పార్టీ అధినాయకులు సమావేశాలు పెట్టుకుని జనసేన టిడిపి కలిసి ముందుకు వెళుతుందని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది జరగడం లేదు.. కూటమి ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి రెండు, మూడు సమావేశాలు బాగానే జరిగినప్పటికీ... నియోజకవర్గ సమన్వయ ఆత్మీయ సమావేశాలు రచ్చ రచ్చ అవ్వడం ఇప్పుడు రెండు పార్టీ నేతలను కలవరపాటుకి గురిచేస్తుంది... నియోజకవర్గ స్థాయిలో పొత్తుకి అంత సిద్ధంగా లేరని సంకేతాలు తాజాగా జరిగిన ఆత్మీయ సమావేశాల ద్వారా వస్తున్నాయి.. టిడిపి జనసేన రాష్ట్ర స్థాయి నేతలు కలిసి పనిచేయాలని చెప్పినప్పటికీ.. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు మాత్రం కలిసి పని చేయడానికి సుముఖంగా లేరనే వాదనలు వినపడుతున్నాయి.

కొట్టుకునే వరకు వెళ్లారుగా:
గతవారం నియోజకవర్గ ఆత్మీయ సమావేశాల్లో టిడిపి జనసేన నేతలు ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి దాకా వెళ్లారు.. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి కృష్ణాజిల్లాలో అయితే ఏకంగా కార్యకర్తల పాటు నేతలు కూడా దాడులు చేసుకున్నారు.. అయితే ఇంత జరుగుతున్న టిడిపి జనసేనలోని రాష్ట్రస్థాయి నేతలు మాత్రం ఎవరు స్పందించకపోవడం పార్టీ నేతలను కలవరపాటుకి గురిచేస్తుంది.. నియోజకవర్గ స్థాయిలో ఇబ్బందులను పట్టించుకోకుండా ఆత్మీయ సమావేశాలు పెట్టుకోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాలను నియోజకవర్గ స్థాయిని నేతలు వ్యక్తం చేస్తున్నారు...ముఖ్యంగా టిడిపి జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ విషయంలో పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఇరు పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి.. అలాంటి నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి టికెట్ విషయంలో క్లారిటీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి..

సీట్ల కోసమే ఈ గొడవలా?
అయితే టీడీపీ జనసేన కూటమిలో సీట్ల పంచాయతీనే గొడవలకి కారణం అని తెలుస్తుంది... 2019లో విడిగా పోటీ చేసిన రెండు పార్టీలు.. ఎన్నికల అయిన తర్వాత నుండి ఎవరికి వారు నియోజకవర్గస్థాయిలో పని చేసుకుంటూ వస్తున్నారు.. 2019 నుండి జనసేన పార్టీలో నియోజకవర్గాలలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ చాలామంది అభ్యర్థులు పని చేసుకుంటూ వస్తున్నారు... 2024 ఎన్నికల కోసం నాలుగేళ్లగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.. మరోవైపు టిడిపిలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది... కానీ ప్రస్తుతం పొత్తు ఏర్పడడంతో.. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు పని చేసిన అభ్యర్థులు కాకుండా వేరే వారికి టికెట్టు వస్తుందని ప్రచారం నేపథ్యంలో.. ఎమ్మెల్యే సీటు వదులుకోవాల్సిన పరిస్థితులు ఎదురు కావడంతో టిడిపి జనసేన నేతల్లో అసంతృప్తి పెరుగుతుంది.. పొత్తులో భాగంగా జనసేనలో కి వెళ్లే సీట్ల సంఖ్య కంటే.. టిడిపికి వెళ్లే సంఖ్య ఎక్కువ ఉండడంతో.. జనసేన నుండి పోటీ చేయాలని భావించిన అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు... ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడి, నియోజకవర్గంలో పని చేసుకున్న నేతలు..ఇప్పుడు టిడిపి కోసం పనిచేయాలంటే ఇబ్బందిగా ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు... ఇప్పటివరకు ప్రత్యర్థులుగా భావించిన వాళ్ళనే అభ్యర్థులుగా ప్రకటిస్తే... వారి తరుపున ఏ విధంగా ప్రచారం చేస్తామని బహాటంగానే చెబుతున్నారు... ఎమ్మెల్యే అవ్వాలని చాలామంది నేతలు జనసేనలో గత నాలుగు ఏళ్లగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు... అలాంటివారు టిడిపి అభ్యర్థి కోసం నియోజకవర్గంలో పని చేయడానికి అంత సుముఖంగా లేనట్టు తెలుస్తుంది.. దాని కారణంగానే మొన్నటి వరకు జరిగిన ఆత్మీయ సమావేశాల్లో గొడవలు జరిగే అనేది పార్టీ నేతలు చెబుతున్న మాట..

ఇరు పార్టీ క్యాడర్‌లో కన్ఫ్యూజన్:
ఇక తాజా పరిణామాలను గమనిస్తుంటే ... టిడిపి జనసేన పొత్తుపై కొంత స్తబ్దత కనబడుతుందనే విమర్శలు వస్తున్నాయి.. ఏ కార్యక్రమం చేసిన టిడిపి జనసేన కలిసి చేస్తుందని మొదట్లో ప్రకటించిన ఇరు పార్టీ నేతలు.. గత వారం పది రోజులుగా ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటున్నారు.. అంతేకాదు ఢిల్లీ వెళ్లి వకేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి సందర్భంలో కూడా రెండు పార్టీల నేతలు వెళ్తారని మొదట్లో ప్రకటించారు.. కానీ తాజాగా టీడీపి నేతలు మాత్రమే ఒంటరిగా ఢిల్లీ వెళ్లి ఏపీ లో ఓట్ల గల్లంతు వ్యవహారం పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు... వాటితోపాటు టిడిపి జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాలు 15 రోజులకు ఒకసారి జరుగుతాయని పార్టీ నేతలు ప్రకటించుకున్నారు.. కానీ ఇప్పటివరకు మీటింగ్ సంబంధించినటువంటి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించలేదు... వాటితోపాటు ఉమ్మడి మినీ మేనిఫెస్టో సమావేశం వారం రోజుకొకసారి జరుగుతుందని చెప్పినప్పటికీ జరగడం లేదు.. టిడిపి జనసేన కూటమిలో ఇబ్బందులు వచ్చాయని అందుకే సమావేశాలు జరగడం లేదని చర్చ నడుస్తుంది.. దీనిపైన ఇరుపాటి నేతలు ఇప్పటి వరకు పెదవి విప్పనప్పటికీ... తెలంగాణ ఎన్నికలు ఉన్నాయనే సమావేశాలు జరగడం లేదని చెబుతున్నారు.. కానీ అసలైన కారణం అది కాదని... క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్న కారణంగానే నేతల సమావేశాలు జరగడంలేదని ప్రచారం జరుగుతుంది..

ఏది ఏమైనాప్పటికీ.. టిడిపి జనసేన పొత్తు ఎంత స్పీడ్ గా కుదిరిందో.. అంతే స్పీడుగా రెండు పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి.. మరి దీనిపైన రాష్ట్రస్థాయి నేతలు స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది...

Also Read: వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌ను ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదా..? కెప్టెన్‌ ప్రెస్‌మీట్‌కు ఇద్దరే మీడియా రిపోర్టర్లు!

WATCH:

Advertisment
తాజా కథనాలు