AP Politics: అజ్ఞాతంలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. గోదావరి జిల్లాల్లో ఏం అసలేం జరుగుతోంది?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరంలో ఇన్‌ఛార్జిలను వైసీపీ మార్చడంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. త్వరలోనే వీరంతా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.

AP Politics: అజ్ఞాతంలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. గోదావరి జిల్లాల్లో ఏం అసలేం జరుగుతోంది?
New Update

AP Politics: ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచే ఏపీ రాజకీయాలు(AP Politics) రక్తి కట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ(YCP)లో ఇన్‌ఛార్జిల మార్పు 'టీ' కప్పులో తుపానుగా మారింది. ఎమ్మెల్యేల (MLA)పనితీరుపై పలు సంస్థల సర్వేల ఆధారంగా సీఎం జగన్‌(Jagan) పలువురికి టికెట్లు నిరాకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటిటి విడుదల వారీగా ఇన్‌ఛార్జిల లిస్ట్‌ రిలీజ్ అవ్వగా.. టికెట్ దక్కని వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

నిన్నమొన్నటివరకు టికెట్ తమకే వస్తుందని భావించిన నేతలు.. తీరా తమ పేరు లిస్ట్‌లో ఉండకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఏపీ ఎన్నికలకు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచే గోదావరి జిల్లాల్లో రాజకీయం మరింత వేడెక్కింది. తూర్పుగోదావరి జిల్లాల్లో పలువురు నేతలు అలకబూనినట్టు తెలుస్తోంది. వారంతా రేపో, మాపో పార్టీ నుంచి జంప్‌ అవ్వనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అజ్ఞాతంలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు:
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడా కనపడడంలేదు. రానున్న ఎన్నికల్లో నలుగురికి టికెట్లు లేవని సీఎం జగన్ తేల్చేశారు.‌ నాలుగు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను మార్చేశారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరంలో ఇన్‌ఛార్జిలను మార్చింది వైసీపీ.‌ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్థానాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. పిఠాపురం ఇన్‌ఛార్జ్‌గా వంగా గీత, ప్రత్తిపాడు ఇన్‌ఛార్జ్‌గా వరుపుల సుబ్బారావు, జగ్గంపేట ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి తోట నరసింహం, పి.గన్నవరం ఇన్‌ఛార్జ్‌గా జెడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ను నియమించారు.

పార్టీ మారుతారా?
జగన్‌ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న నలుగురు సిట్టింగ్‌లు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో వైసీపీని వీడుతారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. అటు ఇటీవలే కాంగ్రెస్‌లో తన పార్టీని షర్మిల విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో కలిసి నడుస్తానని ప్రకటించగా.. ఇతర వైసీపీ అసంతృప్తి నేతలు సైతం అదే దారిలో నడిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నిజానికి ఏపీ రాజకీయాలకు ఆయువుపట్టుగా నిలిచే జిల్లా తూర్పుగోదావరి. గతేడాది తూర్పుగోదావరి సెంట్రిక్‌గా ఎన్నో ఘటనలు జరిగాయి. సీఎం జగన్‌ ఈ జిల్లాలో ఏకంగా ఆరుసార్లు పర్యటించగా.. టీడీపీ మహానాడు నుంచి చంద్రబాబు అరెస్ట్ వరకు అన్ని ఇక్కడే జరిగాయి. ఇక ఎన్నికల ఫలితాలు చూసినా ఈ జిల్లాలో మెజారిటీ సాధించిన పార్టీనే అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ తూర్పుగోదావరి జిల్లాలో 12 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 5 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే 2019లో మాత్రం ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కొట్టుకుపోయింది. కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకుంది.

ఇక 2021లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ఆరు మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్‌ దుమ్ములేపింది. అయితే ఆ తర్వాత నుంచి కాస్త పరిస్థితులు మారుతూ వచ్చాయంటున్నారు విశ్లేషకులు. గతేడాది నుంచి వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు పెరిగాయి. ఇక ఎన్నికలకు ముందు తూర్పుగోదావరి జిల్లాల్లో నలుగురు సిట్టింగులను నిరాకరించడంతో వారు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది.

Also read: హైదరాబాద్ లో మరిన్ని డంప్ యార్డులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు!

#ycp #ap-politics #mla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe