AP POLITICS : ముందుగానే ఎన్నికలు.. బాంబు పేల్చిన జగన్‌!

గతంతో పోలిస్తే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. కేబినెట్‌ భేటీలో జగన్‌ ఈ కామెంట్స్‌ చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తేలికగా తీసుకోవద్దని జగన్ చెప్పారు.

New Update
AP POLITICS : ముందుగానే ఎన్నికలు.. బాంబు పేల్చిన జగన్‌!

AP Elections Fever : ఏపీలో ఎన్నికల ఫీవర్‌(AP Elections Fever) ఎప్పుడో మొదలైంది.. ఇప్పుడు టెంపరేచర్‌ మరింత పెరుగుతోంది. థర్మోమీటర్‌ బ్లాస్ట్‌ అయ్యే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. షెడ్యూల్‌ కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
మంత్రులు మరింత సమర్థవంతంగా పని చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. గతంతో పోలిస్తే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని జగన్‌ తెలిపారు. తెలంగాణలోనూ 20 రోజుల ముందుగా షెడ్యూల్ వచ్చిందన్నారు జగన్.

లైట్‌ తీసుకోవద్దు:
ప్రతిపక్షాల విమర్శలను తేలికగా తీసుకోవద్దన్న సీఎం.. గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ సూచించారు జగన్‌(Jagan). అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని మార్పులు ఉంటాయని సీఎం తెలిపారు. ఇక కేబినెట్‌ భేటీ తర్వాత మంత్రుల్లో మరి కొందరిని నియోజవర్గాలు మార్చే ఛాన్స్‌ ఉందంటూ ప్రచారం జరిగింది

ఏపీలో ఏం జరుగుతోంది?
ఇటీవలి కాలంలో ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డిసెంబర్‌11 ఒకే రోజు వ్యవధిలో జరిగిన వరుస పరిణామాలు వైసీపీలో ప్రకంపనలు సృష్టించాయి. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటపడుతుండడం పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయమవుతోంది. ముఖ్య నేతల కార్యాచరణపై వెలువడుతున్న లీకులు, రూమర్లు కూడా కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. టీడీపీ యువనేత లోకేశ్‌ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరాజయంలో కీలక పాత్ర పోషించిన గాజువాక ఎమ్మెల్యే తనయుడు, నియోజకవర్గ ఇన్చార్జి దేవన్ రెడ్డి వరుస రాజీనామాలు పార్టీకి గట్టి షాకిచ్చాయనే చెప్పాలి. దీనికితోడు మరో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే, ఆయన స్వయంగా దీన్ని ఖండిస్తూ గిట్టని వారు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవన్ రెడ్డి బాటలోనే మరికొందరు కీలక నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ALSO READ: భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. కుల్దీప్‌ రికార్డుకు సెల్యూట్‌ కొట్టాల్సిందే!

WATCH:

Advertisment
తాజా కథనాలు