YCP : అధికారులను అడ్డు పెట్టుకుని టీడీపీ (TDP) పోలింగ్ (Polling) నిర్వహించిందని వైసీపీ (YCP) నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) సీరియస్ అయ్యారు. అలా అని నిరూపించగలరా? అని ఫైర్ అయ్యారు. మే 13 న జరిగిన ఎన్నికల్లో 85 శాతం ప్రజలంతా స్వచ్ఛందంగా ఓట్లు వేశారన్నారు. జరిగిన దాడులను వేరే విధంగా చిత్రీకరణ చేస్తున్నారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తమ ప్రాంతంలో సుమారు 74 మంది గాయాల పాలయ్యారన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకే పలువురు అధికారులను ఈసీ మార్చిందన్నారు. కొన్నిచోట్ల తాము ఫోన్ చేసినా కొందరు పోలీసులు స్పందించలేదన్నారు.
Also Read : జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నుంచి వేరుపడ్డ ఏసీ బోగీలు..నరకం చూసిన ప్రయాణికులు!
ఇది ప్రజలు చేసిన ఎన్నికలని అన్నారు. వైసీపీ నేతలు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాము ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎనభై పోలింగ్ సెంటర్లలో సరైన బందోబస్తు ఎందుకు పెట్ట లేదని ప్రశ్నించారు. వైసీపీ నాయకులతో లాలూచీ పడిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కారు పై దాడి చేసినప్పుడు పోలీసులు చోద్యం చూశారని ఆరోపించారు.