YCP: సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌.. ఎమ్మెల్యేలకు జగన్‌ షాక్‌.. సెకండ్‌ లిస్ట్ ఇదే!

ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తూ షాకింగ్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్‌. ఇప్పటికే 11 మందిని మార్చిన వైసీపీ అధినేత ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పలు చోట్ల మార్పులు చేస్తున్నట్టు సమాచారం. పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌ అని తెలుస్తోంది.

YCP: సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌.. ఎమ్మెల్యేలకు జగన్‌ షాక్‌.. సెకండ్‌ లిస్ట్ ఇదే!
New Update

ఏపీ(AP)లో ఎన్నికలు(Elections) ముంచుకొస్తున్న వేళ అధికార వైసీపీ(YCP)లో పరిణామాలు వేగంగా మారుతుండడం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతే వైసీపీలో ఈక్వేషన్స్‌ ఛేంజ్ అవుతుండడాన్ని ప్రతిపక్ష టీడీపీ నిశీతంగా గమనిస్తోంది. ఓవైపు టీడీపీ, జనసేన పొత్తు.. మరోవైపు జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీలో పొలిటికల్‌ హీట్‌ను రాజేశాయి. ఎన్నికల వ్యూహాలను వైసీపీ వేగంగా అమలు చేస్తోంది.

షాకింగ్‌ డిసిషన్లు:
ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తూ జగన్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే 11 మందిని మార్చిన వైసీపీ అధినేత ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పలు చోట్ల మార్పులు చేస్తున్నట్టు సమాచారం. పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌ అని తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత సమావేశమయ్యారు.

మార్పులు జరిగే అవకాశం ఉన్న సీట్లు:
---> పిఠాపురం నుంచి వంగా గీత!
---> ప్రత్తిపాడు నుంచి పర్వత జానకీ దేవి!
---> జగ్గంపేట నుంచి తోట నర్సింహులు!
---> మండపేట, రామచంద్రపురంల్లోనూ మార్పులు
---> మండపేట నుంచి తోట త్రిమూర్తులు!
---> రామచంద్రపురం నుంచి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ !
---> రాజమండ్రి రూరల్‌ నుంచి వేణుగోపాలకృష్ణ !
---> రాజమండ్రి అర్బన్‌ నుంచి మార్గాని భరత్‌!

రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుంచి 17వ లోక్‌సభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మార్గాని భరత్‌ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలను పదును పెడుతున్న జగన్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అని ఎలాంటి లెక్కలు చూడకుండా గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పలువురి ఎమ్మెల్యేకు నో ఛాన్స్‌ అని చెప్పడం సంచలనంగా మారింది. క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌తో పాటు లోకల్‌గా ఎమ్మెల్యేలపై ఉన్న రిపోర్టులు ఆధారంగా జగన్‌ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయడపతున్నారు.

Also Read: రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ దరఖాస్తులు!

#ycp #jagan #ap-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe