CM Jagan: జగన్ సర్కార్ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే ఏడాది నుంచి పెన్షన్ ను పెంచుతామని చెప్పిన హామీని అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ రూ.3000లకు పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో నిన్న(గురువారం) జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్(CM Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
ALSO READ: అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
పెన్షన్ రూ.3 వేలకు పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలు, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారుపై దిశానిర్ధేశం చేశారు. ఈ భేటీలో కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని అన్నారు. జనవరి నుంచి పెరిగిన పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇవ్వలేదని అన్నారు. వందశాతం హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లబ్దిదారులకు తెలియాలి అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ALSO READ: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ
సీఎం జగన్ మాట్లాడుతూ..
* జనవరి 1 నుంచి వైయస్ఆర్ పెన్షన్ కానుక(YSR Pension Kanuka) రూ.3వేలకు పెంపు.
* రూ.3వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం.
* విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నాం.
* జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుంది.
* 2019లో మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు
* మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 లు చేశాం.
* ఆ తర్వాత ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం.
* గత ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్ల మాత్రమే సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు.
* ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం.
* మన రాకముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు.
* రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.
* మూడో కార్యక్రమం వైఎస్సార్ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.