YS Sharmila: ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపావు.. షర్మిల ఎమోషనల్ ట్వీట్

AP: ఫాదర్స్ డే సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. 'నీ పట్టువదలని పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దావు' వైఎస్ తో ఉన్న ఫోటో జోడించి ట్వీట్ చేశారు.

New Update
YS Sharmila: ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపావు.. షర్మిల ఎమోషనల్  ట్వీట్

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. 'నీ పట్టువదలని పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దావు' వైఎస్ తో ఉన్న ఫోటో జోడించి ట్వీట్ చేశారు.

ట్విట్టర్ లో.. "నీ పట్టువదలని పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దావు. నీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి సవాళ్ళను ఎదుర్కొనేలా తయారు చేసావు. మనిషిని ప్రేమ, సంస్కారం, కరుణతో గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచావు. నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నాను. ప్రజలకోసం పాటుపడే నీ ఓర్పును, నిబద్ధతను వారసత్వంగా చేసుకుని ముందుకు సాగుతున్నాను. నువ్వెక్కడున్నా నీ ఆశీర్వాదం, అనురాగం, మార్గదర్శనం నాతో ఉన్నాయని తలుస్తాను." అంటూ రాసుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు