YS Sharmila: జగన్ ఓటమిపై షర్మిల సంచలన ట్వీట్

AP: ఎన్నికల ఫలితాలపై స్పందించారు షర్మిల. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

New Update
YS Sharmila: జగన్ ఓటమిపై షర్మిల సంచలన ట్వీట్

YS Sharmila: ఎన్నికల ఫలితాలపై స్పందించారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. మనకు ప్రత్యేక హోదా రావాలని కోరారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని అన్నారు. రాజధాని నిర్మాణం జరగాలని.. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని హితవు పలికారు. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు