Ap News: మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు... ఎవరి పని? మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్‌పై దాడి జరిగింది. శుక్రవారం గుర్తుతెలియని దుండగులు ఎన్నికల ప్రచార రథాన్ని దహనం చేశారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమని, ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని భరత్ చెప్పారు. By Vijaya Nimma 29 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ap Crime: వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్‌పై దాడి జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఎన్నికల ప్రచార రథాన్ని దహనం చేశారు. రాజమండ్రిలోని వీఎల్‌పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆఫీస్ దగ్గర ఈ వాహనాన్ని ఉంచారు. దీనికి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భరత్ సమాచారం ఇచ్చారు. వెంటనే భరత్‌తో పాటు ఇన్స్పెక్టర్ కడలి సత్యనారాయణ, బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ రాజమండ్రిలో ఇటు వంటివిష సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. ఈవిధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని భరగ్‌రామ్ చెప్పారు. ఇది కూడా చదవండి:మీ భర్త పుట్టినరోజున అతనికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈ ఐడియా మీ కోసమే! #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి