Chandrababu New Convoy : చంద్రబాబుకు కొత్త కాన్వాయ్ సిద్ధం.. ప్రత్యేకతలేంటో తెలుసా?

సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్న చంద్రబాబు కోసం అధికారులు కొత్త కాన్వాయ్ ను సిద్ధం చేశారు. బ్లాక్ అంబ్ బ్లాక్ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలు చంద్రబాబు కాన్వాయ్ లో ఉండనున్నాయి. సేఫ్టీ టెస్టింగ్ సైతం పూర్తి చేసుకున్న ఈ వాహనాలపై AP 9G 393 నంబర్ ప్లేట్ ను కేటాయించారు.

Chandrababu New Convoy : చంద్రబాబుకు కొత్త కాన్వాయ్ సిద్ధం.. ప్రత్యేకతలేంటో తెలుసా?
New Update

AP New CM Chandrababu : టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబోయే కొత్త సీఎం కోసం అధికారులు కొత్త కాన్వాయ్ (New Convoy) ను సిద్ధం చేశారు. గతంలో సిల్వర్ కవర్ సఫారీ వాహనాలను ఆయన కాన్వాయ్ లో ఉపయోగించనున్నారు. చంద్రబాబు అంటేనే సఫారీ వాహనాలు అన్న అభిప్రాయం కూడా ఉండేది. అయితే.. ఈ సారి కూడా తనకు ఇష్టమైన సఫారీ వాహనాలనే చంద్రబాబు తన కాన్వాయ్ లో వినియోగిస్తారని అంతా భావించారు.

కానీ ఈ సారి బ్లాక్ అండ్ బ్లాక్‌లో కొత్త కాన్వాయ్‌ ఉండనుంది. కొత్త కాన్వాయ్‌లో 11 టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉంటాయని తెలుస్తోంది. 11 వాహనాల్లో 2 వాహనాలను సిగ్నల్‌ జామర్ల కోసం కేటాయించారు. ఆ వాహనాలు 393 నంబర్‌ ప్లేట్‌ తో ఉన్నట్లు సమాచారం. తాడేపల్లి ఇంటెలిజెన్స్ ఆఫీసులో ఈ కాన్వాయ్ ను సిద్ధంగా ఉంచారు అధికారులు. వీటికి సేఫ్టీ టెస్టింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఎల్లుండి ప్రమాణస్వీకారానికి చంద్రబాబు ఈ కాన్వాయ్ లోనే వెళ్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

#andhra-pradesh #ap-tdp #chandrababu #new-convoy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe