/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Free-Bus-jpg.webp)
AP Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈనెల 12న ఆర్టీసీ, రవాణా శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై సీఎం చర్చిస్తారని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని అన్నారు. ఈరోజు ఆర్టీసీ, రవాణాశాఖలపై మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు సమాచారం.