YS Sharmila: షర్మిల ఏ పార్టీలో అయినా చేరొచ్చు.. పవన్ సీటును డిసైడ్ చేసేది టీడీపీనే: మంత్రి అమర్నాథ్

ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ లో చేరినా.. కేఏ పాల్ పార్టీలో చేరినా మాకేం సంబంధం అని అన్నారు. సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిదన్నారు.

New Update
YS Sharmila: షర్మిల ఏ పార్టీలో అయినా చేరొచ్చు.. పవన్ సీటును డిసైడ్ చేసేది టీడీపీనే: మంత్రి అమర్నాథ్

వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో క్రియాశీలకంగా మారుతారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఆమె వ్యక్తిగతమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చన్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరినా.. కే.ఏ.పాల్ పార్టీలో చేరిన మాకేం సంబంధం అని ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైసీపీకి ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Big Breaking: వైసీపీ అభ్యర్థులు ఫైనల్.. లిస్ట్ ఎప్పుడంటే?

రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నారు. ఈ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఒకరు, ఇద్దరు వెళ్ళిపోతే పార్టీకి నష్టం జరుగుతుందిది అమయకత్వమేనన్నారు. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మరాను తప్ప జనసేన, పవన్ కళ్యాణ్ నచ్చి వెళ్లినట్టు వంశీ చెప్పలేదన్నారు.

పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారని ఎద్దేవా చేశారు. జనసేన భవిష్యత్ లోకేష్ డిసైడ్ చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీకి కట్టుబడి పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్ ను పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తామన్నారు అమన్నాథ్.

Advertisment
తాజా కథనాలు