ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి తల్లి సత్యనారాయణమ్మ (66) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. తల్లి మరణం గురించి తెలియగానే.. తాడే పల్లిలో ఉన్న మంత్రి రాజా వెంటనే తుని వెళ్లారు. మంత్రి తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆమెకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో.. తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు..

ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం
New Update

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి తల్లి సత్యనారాయణమ్మ (66) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. తల్లి మరణం గురించి తెలియగానే.. తాడే పల్లిలో ఉన్న మంత్రి రాజా వెంటనే తుని వెళ్లారు. మంత్రి తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆమెకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో.. తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సత్యనారాయణమ్మ మరణంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మంత్రులు, పలువురు నేతలు, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణమ్మ మరణంతో రాజా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. సత్యనారాయణమ్మ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం నిర్వహించే అవకాశం ఉంది. మంత్రి దాడిశెట్టి తల్లి మరణానికి సంతాపంగా శనివారం తుని మార్కెట్ బంద్‌ పాటిస్తున్నారు.

కాగా దాడి శెట్టి రాజా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి రెండు సార్లు 2014, 2019 పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. దాడిశెట్టి రాజా 2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుని నియోజకవర్గం టికెట్ ఆశించినా దక్కలేదు. ఆ తర్వాత రాజా 2011లో వైపీపీలో చేరారు. అనంతరం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

#andhra-pradesh #ap-minister-dadisetti-raja #satyanarayanamma-passed-away #satyanarayanamma #thuni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe