జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై (Janasena Pawan Kalyan) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathayanarayana) మరో సారి సంచలన కామెంట్స్ చేశారు. ఏదైనా అంశంపై మాట్లాడే ముందు పవన్ కల్యాన్ అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ఒక వేళ ఆయనకు అవగాహన లేకపోతే ట్యూషన్ కి వస్తే తాను వివరిస్తానన్నారు. ఇప్పటి నుంచైనా పవన్ అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు కేసులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పవన్ కోరాలని డిమాండ్ చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన అధికారంలోకి రావడానికి కనుచూపు మేరలో కూడా అవకాశాలు కనపడటం లేదన్నారు బొత్స.
ఇది కూడా చదవండి: సీఎం ఛాన్స్ వస్తే వదులుకోను అంటున్న పవన్..!
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు సామాజిక సాధికార బస్ యాత్రను నిర్వహించనున్నట్లు బొత్స తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాలగా విభజించి బస్సు యాత్రను నిర్వహిస్తామన్నారు. 13 రోజుల పాటు తొలి దశ యాత్ర ఉంటుదన్నారు. చెప్పిన హామీలు అమలు చేసిన అనంతరం ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు బొత్స.
ఇది కూడా చదవండి: టీడీపీకి మైలేజ్ తగ్గింది..పవన్‌పై జనసేన నేతల ఒత్తిడి..!!
ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి జగన్ మోహన్ రెడ్డి చేశారని అన్నారు. రూ.వేయి నుంచి రూ.1400 కోట్లతో ఒక్కో నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చి అందరికీ వైద్యం అందించిన ప్రభుత్వం తమదేన్నారు.