బాబు గ్రాఫిక్స్ చూపించారు తప్ప.. రాజధాని కట్టాలేదు: మంత్రి ఆదిమూలపు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లన్నీ చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్ ది మాత్రమేనని చెప్పారు. ప్రాజెక్టుల మీద చంద్రబాబు యుద్ధం ప్రకటిస్తానని చెప్పడం హాస్యాస్పదం అని మంత్రి సురేష్ అన్నారు. గ్రాఫిక్స్ చూపించడం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా? అని మంత్రి నిలదీశారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని.. By E. Chinni 07 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లన్నీ చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్ ది మాత్రమేనని చెప్పారు. ప్రాజెక్టుల మీద చంద్రబాబు యుద్ధం ప్రకటిస్తానని చెప్పడం హాస్యాస్పదం అని మంత్రి సురేష్ అన్నారు. గ్రాఫిక్స్ చూపించడం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా? అని మంత్రి నిలదీశారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్త పుత్రుడు ఎన్ని వైపుల నుంచి ఎంత తిరిగినా.. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారన్నారని చెప్పారు మంత్రి ఆదిమూలపు. రైతులను మోసం చేసిన 'రైతు ద్రోహి' చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. రెండు టన్నెల్స్ త్వరలో ప్రారంభిస్తామని.. ప్రాజెక్ట్ నిర్వాసితులకు సమస్యలు పరిష్కరించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాకు ఏం చేశారో.. చంద్రబాబు, లోకేష్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యవస్థలపై దాడి చేసి అలజడి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. డ్రోన్ కెమెరాల్లో వ్యూల కోసం ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డికి ప్రజల్లో ఉన్న జనాధరణను చూసి ఓర్వలేకనే పుంగనూరు ఘటనకు చంద్రబాబు పూనుకున్నారని దుయ్యబట్టారు మంత్రి ఆదిమూలపు సురేష్. #tdp #tdp-chief-chandrababu #ap-minister-adimulapu-suresh #adimulapu-suresh #satires మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి