Ongole: ఒంగోలులో గెలుపు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ!

ఎంపీ సీటు కోసం ఒంగోలులోనూ రసవత్తర పోరు జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు గెలుపుకోసం పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Ongole: ఒంగోలులో గెలుపు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ!
New Update

Ongole: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పార్లమెంట్ సీటుకు వెళ్దాం. ఈ లోక్‌సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సొంత క్యాడర్ ఉండటం టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి కలిసొస్తుంది. జిల్లాలో తొలినుంచీ మాగుంట కుటుంబానికి మంచిపేరు ఉంది.

publive-image  ఇక వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రకాశం జిల్లాలో పెద్దగా పట్టులేకపోవడం ఆయనకి ఇబ్బందిగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారి పూర్తి సహకారం అందడం లేదని టాక్ వినిపిస్తోంది. వైసీపీకి పట్టున్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు కొత్తవారు కావడం చెవిరెడ్డికి ఇబ్బందిగా మారింది.

publive-image

ఒంగోలు లోక్‌సభ పరిధిలోని గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండపి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో ఇప్పటికే చెప్పాం. ఒంగోలు పార్లమెంట్‌లో కూడా టీడీపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది.

publive-image

#ongole #2024-lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe