Machilipatnam: మచిలీపట్నం మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్న బాలశౌరి ఇప్పుడు జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చే అంశం. మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆయనకు కొంత క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది.
సిట్టింగ్ ఎంపీగా బాలశౌరికి ఏడు నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మద్దతు ఉంది. అత్యధికంగా ఉన్న కాపు, బీసీ ఓటు బ్యాంక్ ఆయనకు కలిసి వచ్చే అంశం. ఈసారి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి ఎక్కువ సానుకూలత కనిపిస్తోంది. ఆ ఫలితమే ఎంపీ ఎన్నికలోనూ వస్తుందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
ఓవరాల్‌గా మచిలీపట్నం పార్లమెంట్‌లో జనసేన అభ్యర్థి బాలశౌరి గెలిచే ఛాన్స్ ఉన్నట్టు ఆర్టీవీ స్టడీలో వెల్లడైంది. పూర్తి వివరాలకోసం ఈ వీడియో చూడండి.