Nara Lokesh : ప్రభాస్ 'కల్కి' పై నారా లోకేష్ పోస్ట్.. సంతోషంగా ఉందంటూ!

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘కల్కి’ టీమ్‌ను అభినందిస్తూ ట్విట్టర్ (ఎక్స్‌)లో పోస్ట్‌ పెట్టారు. సినిమాకు వస్తోన్న అద్భుతమైన రివ్యూలు వినడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్‌ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణెలకు అభినందనలు తెలిపారు.

Nara Lokesh :  ప్రభాస్ 'కల్కి' పై నారా లోకేష్ పోస్ట్.. సంతోషంగా ఉందంటూ!
New Update

AP IT Minister Tweet On Prabhas Kalki Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి’ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఎర్లీ మార్నింగ్ షోస్ తోనే స్క్రీనింగ్ మొదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు థియేటర్స్ వద్ద ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బ్లాక్ బస్టర్ బొమ్మ అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

మరోవైపు సినీ,రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘కల్కి’ టీమ్‌ను అభినందిస్తూ ట్విట్టర్ (ఎక్స్‌)లో పోస్ట్‌ పెట్టారు. సినిమాకు వస్తోన్న అద్భుతమైన రివ్యూలు వినడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Also Read : ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ పై అప్డేట్ ఇచ్చిన శంకర్..!

ప్రభాస్‌ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణెలకు అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను తెరకెక్కించారంటూ నాగ్‌ అశ్విన్‌కు ధన్యవాదాలు చెప్పారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేశారంటూ" తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాను సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

#nara-lokesh #kalki-2998-ad-movie #nara-lokesh-about-kalki-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి