AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్!

విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రిజల్ట్స్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్!
New Update

AP Inter Results 2024: విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

AP Inter Results 2024

ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలు..
పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని అధికారిక 'Board of Intermediate Education Andhra Pradesh' (BIEAP) వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని సూచించింది. గత నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా మొదటి సంవత్సరం 22,239 ద్వితీయ సంవత్సరం 25,173 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు.

ఇక ఇంటర్‌ ఫలితాల (AP Inter Results 2024)కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులపై ఎన్నికల ప్రభావం ఉండకుండా, ఎన్నికలకు ముందే ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉండటంతో ఫలితాల వెల్లడిపై ఈసీ ఆమోదం తప్పనిసరి. దీంతో విద్యాశాఖ ఈ మేరకు ఈసీ ఆమోదం కోరినట్లు సమాచారం.

Results Link: https://resultsbie.ap.gov.in/

Also Read: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు

#ap-inter-board #ap-inter-results-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి