Minister Anitha: అనకాపల్లిలో విషాద ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజు హోమంత్రితోపాటు హాస్పిటల్ వెళ్లారు.
వారే నిర్లక్ష్యంగా వ్యవహరించారు..
ఈ మేరకు మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. మొత్తం 92 మంది పిల్లలన్నారు. 82 మందికి అస్వస్థతకు గురయ్యారు. అందులో 3 చనిపోయారు. కేజీహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం పిల్లలకు అస్వస్థతకు గురైన వెంటనే వాళ్ళ తల్లితండ్రులను పిలిపించి, వాళ్ళుని పంపించి వేశాం. అందరూ చాల చిన్న పిల్లలే. చాల బాధకారం. పిల్లలకు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాని వల్ల ఇంతటి ఘోరం జరిగింది. పాస్టర్ కిరణ్ పై కేసు నమోదు చేసాం త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామన్నారు.
ఇక ప్రభుత్వ పరంగా మృతి చెందిన పిల్లల కుటుంబానికి 10 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించారు. బయట ఫంక్షన్ నుంచి తీసుకొచ్చిన ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అసలు ఫుడ్ ఎవరు పంపించారు? సమోసాలు ఎవరు తెచ్చారు? అనే దానిపై విచారణ చేస్తున్నాం. మతపరమైన బోధనలు చేసి తల్లిదండ్రులను మోటివ్ చేసి ఇలాంటి చోట్లకు తీసుకొస్తున్నారు. ఇలాంటి హస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్న క్లోజ్ చేస్తాం. ఇప్పటకే విశాఖ జిల్లాలో రెండు ఉన్నట్లు గుర్తించాం. వాటిని క్లోజ్ చేయ్యాలని ఆదేశాలు జారీ చేసామని తెలిపారు.