IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్!

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

New Update
IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్!

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. 14 రోజుల్లో తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందా? లేదా వ్యతిరేకంగా వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఉపశమనం లభించకపోవడంపై టీడీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రేపు జరగాల్సిన నారా లోకేష్ విచారణ ఈ నెల 10కి వాయిదా పడడంతో టీడీపీ శ్రేణులకు కాస్తు ఉపశమనం లభించినట్లు అయ్యింది.

ఈ వార్త అప్టేట్ అవుతోంది..

Advertisment
తాజా కథనాలు