స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ చేపట్టింది. కొంతమందికి మాత్రమే నోటీసులు అందాయని, మరి కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని.. మిగతా వారి అడ్రస్ లు తప్పుగా ఉండటంతో అవి చేరలేదని రిజిస్ట్రార్ కోర్టుకు తెలిపారు. వీరికి పర్సనల్ నోటీసులు ఇవ్వటానికి పిటిషనర్ అనుమతి కోరారు. దీంతో కొత్త అడ్రస్ లతో మళ్లీ ఫ్రెష్ నోటీసులు ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది న్యాయస్థానం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు