Volunteers Resign: 62వేల మంది వాలంటీర్లు రాజీనామా

AP: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్‌కు మద్దతుగా ఇప్పటివరకు 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని పిటిషనర్‌ న్యాయవాది తెలిపారు. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఉంటారని పేర్కొన్నారు. దీనిపై విచారణను 2 వారాలకు కోర్టు వాయిదా వేసింది.

New Update
YSRCP: పోస్టల్ బ్యాలెట్ రూల్స్‌పై హైకోర్టుకు వైసీపీ

Volunteers Resign: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలయ్యే వరకు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌. ఇప్పటివరకు 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది పేర్కొన్నారు.

రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఉంటారని పిటిషనర్‌ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టికల్‌ 324 ప్రకారం విస్త్రృత అధికారాలున్నాయని.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆధికారాలు వినియోగించవచ్చని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు