AP IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారాయణ అల్లుడికి హైకోర్టు షాక్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. సీఐడీ తనకు ఇచ్చిన నోటీసులను క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 10 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (IRR Case) ఏపీ మాజీ మంత్రి నారాయణ (AP Ex Minister Narayana) అల్లుడు పునీత్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సీఐడీ ఇచ్చిన నోటీస్ ను క్వాష్ చేయాలని పునీత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ నిర్వహించిన హైకోర్టు రేపు సీఐడీ విచారణకు న్యాయవాది తో కలిసి హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. నారా లోకేష్ కూడా స్కిల్ డవలప్మెంట్ కేసులో ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: Chandrababu Case Updates: స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మరో షాక్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన విచారణ సాగింది. అయితే.. ఆయన సమాధానంపై సంతృప్తి చెందని సీఐడీ అధికారులు రేపు మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన రేపు మరో సారి సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. అయితే.. రేపు పునీత్ కూడా విచారణకు హాజరైతే.. నారా లోకేష్ తో కలిపి ఆయనను విచారించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి నారాయణ ఐఆర్ఆర్ కేసులో సీఐడీ తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను తప్పనిసరిగా విచారించాలని భావిస్తే.. ఇంటి వద్దనే విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. తాను అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. తనకు గతంలో మేజర్ సర్జరీలు అయ్యాయని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. #ap-high-court #inner-ring-road-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి