YCP Offices: వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు! AP: వైసీపీకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాలు కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతల విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేసింది. 2 నెలల్లోగా భవన నిర్మాణాల అనుమతులు అధికారులకు సమర్పించాలని చెప్పింది. By V.J Reddy 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YCP Office Demolition: వైసీపీకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాలు కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివెతల విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల్లోగా భవన నిర్మాణాల అనుమతులు అధికారులకు సమర్పించాలని చెప్పింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని తెలిపింది. ప్రతి దశలో వైసీపీ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని చెప్పింది. పబ్లిక్‌కు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతలపై ఆలోచన చేయాలని తెలిపింది. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తోంది పిటిషన్లు దాఖలు చేశారు వైసీపీ నేతలు. అయితే.. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తుందని వైసీపీ నేతలు భావించారు. చట్టప్రకారం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వం నెక్ట్స్ స్టెప్ ఏంటన్న ఆంశం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 22న ఉదయం తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసులను అధికారులు కూల్చివేశారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న వైసీపీ ఆఫీసులపై అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆయా ఆఫీసులను నిర్మిస్తున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. Also Read: ప్రధానిని కలిసిన టీమిండియా.. రోహిత్ సేనకు మోదీ విందు! #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి