/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-21T163420.635-jpg.webp)
Group - 2 Applications : ఏపీలో గ్రూప్ 2(Group-2) అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు(Applications Deadline) పొడిగించింది ఏపీపీఎస్సీ(APPSC). అభ్యర్ధుల నుంచి వచ్చిన విజ్నప్తుల మేరకు దరఖాస్తుల గడువును మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ(APPSC) ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు జనవరి 17 (January 17)అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
కాగా గ్రూప్ 2పోస్టులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిచేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అప్లికేషన్స్ గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అటు రాష్ట్రంలో మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను గతేడాది డిసెంబర్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, 566నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోనికి తీసుకుని దరఖాస్తుల గడువును జనవరి 17 వరకు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాల కోసం https://psc.ap.gov.in/ పై క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: చిచ్చు పెట్టిన రుద్రాణి.. రెచ్చిపోతున్న ధాన్యలక్ష్మీ