AP Governor: చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం వ్యక్తం చేశారు. అరెస్ట్ గురించి ప్రభుత్వం తనకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. బాబు అరెస్ట్ అంశం మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

AP Governor: చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం!
New Update

AP Governor: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం వ్యక్తం చేశారు. అరెస్ట్ గురించి ప్రభుత్వం తనకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అవినీతి నిరోధక చట్టం 2018లో చేసిన సవరణల ప్రకారం మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరగా తీసుకోవాలి. కానీ మాజీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు అరెస్టుపై ప్రభుత్వం గవర్నర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. బాబు అరెస్ట్ అంశం మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్మెంట్..

ఇటు తెలుగుదేశం పార్టీ నేతలకు రేపు ఉదయం 9 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కూడిన బృందానికి అపాయింట్మెంట్ ఖరారు అయింది. ప్రస్తుతం విశాఖ పోర్టు గెస్ట్ హౌస్‌లో గవర్నర్ ఉన్నారు. అయితే ప్రస్తుతం తమ నిర్బంధంలో ఉన్న టీడీపీ నేతలకు గవర్నర్‌ను కలవడానికి పోలీసులు అనమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధం..

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(సి) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరని వెల్లడించారు. గవర్నర్ అనుమతి లేకపోతే దర్యాప్తు చెల్లుబాటు కాదని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందుచేత సీఐడి రిమాండ్ రిపోర్టు చాలా కీలకమని వెల్లడించారు.

24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలి..

ఇక చంద్రబాబు అరెస్టుపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా స్పందించారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని చెప్పారు. చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరే అవకాశాలున్నాయని.. సీఐడీ కస్టడీ పిటిషన్ తిరస్కరణకు గురైతే జడ్జి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారని... అప్పుడు బెయిల్ పిటిషన్ వేసేందుకు వీలుంటుందన్నారు. సీఐడీ ప్రొసీడింగ్స్, పోలీస్ ప్రొసీడింగ్స్ కు పెద్దగా తేడా ఉండదని.. అయితే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ ఉండడం వల్ల ఈ కేసులో ప్రొసీడింగ్స్ మారిపోతాయన్నారు. చంద్రబాబును నేరుగా ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుందని జేడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: రేపు చంద్రబాబు పెళ్లి రోజు.. ఇవాళ అరెస్ట్

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి