AP News: జగన్ రాజీనామాను ఆమోదించిన ఏపీ గవర్నర్

జగన్ రాజీనామాను ఏపీ గవర్నర్ ఎస్ .అబ్దుల్ నజీర్ ఆమోదించారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న జగన్ ఈ రోజు సాయంత్రం తన రాజీనామా లేఖను పంపించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. కూటమికి 165 సీట్లు రాగా వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది.

New Update
Jagan: నేడు వినుకొండకు జగన్.. 144 సెక్షన్ అమలు!

AP: జగన్ రాజీనామాను ఏపీ గవర్నర్ ఎస్ .అబ్దుల్ నజీర్ ఆమోదించారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న జగన్ ఈ రోజు సాయంత్రం తన రాజీనామా లేఖను పంపించారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా కూటమికి 165 సీట్లు రాగా వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ప్రమాణస్వీకారం, క్యాబినెట్ ఏర్పాటు తదితర అంశాలపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదిలావుంటే జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు.  ఇలాంటి ఫలితాలను తాను ఊహించలేదన్నారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదు, పింఛన్లు అందుకున్న అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు.

publive-image

Advertisment
తాజా కథనాలు