AP Government To Start Development Works In Amaravati : అమరావతి (Amaravati) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు (CM Chandrababu) సర్కార్. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ముళ్లకంపల తొలగింపును ప్రారంభించనున్నారు మంత్రి నారాయణ. సచివాలయం వెనుక ఎన్ 9 రోడ్డు నుంచి పనులు ప్రారంభిస్తారు. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల కాలంగా పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. 3 నెలల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు అధికారులు. అక్టోబర్ నెలాఖరు నుండి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
Also Read : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం!