YSR Kapu Nestham Scheme: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.15 వేలు

ఆంధ్ర ప్రదేశ్ లో కాపు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. ఈ నెల 22వ తేదీన కాపు నేస్తం నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్ల లో డబ్బుల్ని జమ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆ జిల్లా కలెక్టర్ మాధవీలత సమీక్ష చేస్తున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్, సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ లో సభ, నెహ్రూ బొమ్మ సెంటర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హెలిప్యాడ్ కు స్థలాలను పరిశీలించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున సహాయం అందిస్తుంది.

YSR Kapu Nestham Scheme: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.15 వేలు
New Update

AP Government to release YSR Kapu Nestham Scheme Funds: ఆంధ్ర ప్రదేశ్ లో కాపు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. ఈ నెల 22వ తేదీన కాపు నేస్తం నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బుల్ని జమ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆ జిల్లా కలెక్టర్ మాధవీలత సమీక్ష చేస్తున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్, సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ లో సభ, నెహ్రూ బొమ్మ సెంటర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హెలిప్యాడ్ కు స్థలాలను పరిశీలించారు.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున సహాయం అందిస్తుంది. అంటే ఐదేళ్లలో వారికి మొత్తం రూ.75 వేలను అందిస్తోంది. ఈ సారి నాలుగో విడత డబ్బుల్ని విడుదల చేస్తున్నారు. కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12 వేల లోపు ఆదాయం ఉండాలి.

కాపు నేస్తానికి సంబంధించి కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి.. మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు మాత్రమే అర్హులు. కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవాళ్లు ఈ పథకానికి అనర్హులు. అలాగే కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తే ఈ పథకానికి అనర్హులు. అయితే ఆటో, టాటా ఏస్‌, ట్రాక్టర్‌ వంటి వాహనాలను జీవనోపాధి కోసం ఉన్నవాళ్లు మాత్రం అర్హులు. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పుటికీ ఈ పథకానికి అర్హులు. ఈ స్కీమ్ కి ఆధార్‌ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వయసు నిర్దారణ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి.

కాపు నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అకౌంట్‌ లో పడగానే లబ్ధిదారుల మొబైల్‌ కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఈ పథకం కింద లబ్ది పొందేందుకు అర్హత ఉన్నా సరే.. కొన్ని అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేని వారు వెంటనే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత అర్హులైన వారికి కూడా కచ్చితంగా ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ అకౌంట్‌ లో డబ్బులు పడకపోతే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే అర్హుల జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

#ap-cm-jagan #ap-government #ysr-kapu-nestham-scheme #august-22nd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe