Jagananna Chedodu: ఏపీలో వారికి గుడ్ న్యూస్‌..మరికాసేపట్లో ఖాతాల్లోకి 10 వేలు!

గురువారం ఏపీ కర్నూలు ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు (Jagananna chedhodu) కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్(Jagan) పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక, నాయీ బ్రహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

Jagananna Chedodu: ఏపీలో వారికి గుడ్ న్యూస్‌..మరికాసేపట్లో ఖాతాల్లోకి 10 వేలు!
New Update

Jagananna Chedodu Scheme: గురువారం ఏపీ కర్నూలు ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు (Jagananna chedodu) కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక, నాయీ బ్రహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,25,020 మందికి రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన రజకులు, నాయీ బ్రహ్మణ, టైలర్లకు ప్రతి సంవత్సరం రూ. 10 వేలు చొప్పున సాయం అందిస్తుంది. ఈ ఏడాది వేసే నగదుతో కలిపి ఇప్పటి వరకు వారి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 40 వేలు ఆర్థిక సాయం అందించింది ఏపీ ప్రభుత్వం.

Also Read: యూనివర్సిటీ హాస్టల్‌ లో ఫుడ్‌ పాయిజినింగ్‌..300 మంది విద్యార్థినులకు అస్వస్థత!

గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించిన సాయం మొత్తం కలిపి రూ. 1,252.52 కోట్లుగా ఉందని ప్రభుత్వం తెలియజేసింది. ఈ పథకం కింద 1,80,656 మంది టైలర్లకు ఈసారి రూ. 180.66 కోట్ల లబ్ధి చేకూరుతుందని అధికారులు వివరించారు. నాయీ బ్రహ్మణులకు రూ. 39.81 కోట్లు, 1,04,551 మంది రజకులకు రూ.104.55 కోట్లు సాయం అందనుంది.

ఇప్పటికే గ్రామాల్లోని సచివాలయాల్లో అర్హులైన వారి జాబితాను ఉంచారు. అర్హులైన వారందరికీ కూడా సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు వివరించారు. అర్హులైన వారికి ఎవరికైనా ఈ విడతలో సంక్షేమ పథకం అందనట్లయితే..వారికి మరోసారి అంటే జూన్, డిసెంబర్‌ లో నగదు అందజేస్తామని అధికారులు వివరించారు.

జగనన్న చేదోడు పథకం (Jagananna Chedodu Scheme) క్రింద ఇప్పటి వరకు అందించిన లబ్ధిదారులు..

2020-21 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,98,122 సాయం రూ. 298.12 కోట్లు

2021-22 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,99,225 సాయం రూ. 299.23 కోట్లు

2022-23 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 సాయం రూ. 330.15 కోట్లు

2023-24 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,25,020 సాయం రూ. 325.02 కోట్లు

మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు.

Also read: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ సారి ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

#jagan #jagananna-chedodu #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe