Good News For AP Women's : మహిళలకు ఫ్రీ బస్(Free Bus) జర్నీ.. ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ పదం ఇదే. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. అయితే.. అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే ఈ పథకాన్ని పట్టాలు ఎక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఈ పథకం ఇప్పుడు విజయవంతంగా అమలు అవుతోంది. గత కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించిన స్కీంలలో ఇది ఒకటి. అక్కడ కూడా ఈ పథకం అమల్లో ఉంది. ఎలాగైనా ఏపీలో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు.. ఈ ఫ్రీబస్ స్కీం హామీని ప్రకటించేశారు.
ఇది కూడా చదవండి: ABP-CVoter Opinion Poll : కాంగ్రెస్ కు 11 సీట్లు.. బీఆర్ఎస్ కు భారీ షాక్: ఎంపీ ఎన్నికలపై సంచలన సర్వే
తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. దీంతో అలర్ట్ అయిన సీఎం జగన్.. ఒక అడుగు ముందుకేసి ఎన్నికల వరకు ఆగకుండా ముందే ఈ స్కీమ్ ను అమలు చేస్తే పోతుంది కదా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్కీమ్ అమలుకు ప్లాన్ మొదలు పెట్టినట్లు సమాచారం. జగన్ ఆదేశాలతో తెలంగాణ అధికారులతో APSRTC అధికారులు చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇందుకు ఎంత ఖర్చు అవుతోంది? తదితర విరరాలను APSRTC అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్న ఆర్టీసీ అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే న్యూ ఇయర్ లేదా సంక్రాంతి కానుకగా ఈ స్కీమ్ ను స్టార్ట్ చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.