Ap Govt: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు...ఇక నుంచి ఆ పేరుతో! ఏపీలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కూటమి రెడీ అవుతుంది.ఇందులో ముందుగా గ్రామ సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది. By Bhavana 11 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి AP Grama Sachivalayam: ఏపీలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కూటమి రెడీ అవుతుంది. ఇప్పటికే సచివాలయాల్లో సిబ్బందిని ప్రక్షాళన చేయడంతో పాటు ఎక్కువగా ఉన్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని మార్పులకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ముందుగా గ్రామ సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా (Village Welfare Office) మార్చుతున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయంలో డీడీఓగా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ద్వారానే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులగుర్తింపు, జాబితాను తయారు చేయాలని ఎటువంటి రాజకీయం ఒత్తిడి లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. మరోవైపు గ్రామ పంచాయితీ కార్యాలయం, గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేసి అక్టోబర్ 2 నుండి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పని చేస్తున్న ఐదుగురు ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు సిబ్బంది ప్రక్షాళన ఎలాగో ఉండబోతోంది. Also Read: మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే…కొత్త జంటకు రేషన్ కార్డు! #ap-news #chandrababu-naidu #grama-sachivalayam #grama-sakshemam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి