BREAKING: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరించింది. వైఎస్సార్‌ సహా కొందరి వైసీపీ నేతల పేర్లు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో జగన్ ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

CM Chandrababu: ఏపీలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరణ చేసింది. ఆయా ప్రాజెక్టులకు వాస్తవ పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ సహా కొందరి వైసీపీ నేతల పేర్లు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో జగన్ ప్రభుత్వం పెట్టింది. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ పేరు తొలిగింపు..

జగన్‌ పేరు తొలగింపు వివాదం రాజేసుకుంది. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యుమెంటల్‌పై ఉన్న జగన్ (YS Jagan) పేరును తొలిగించారు. మొన్న అర్ధరాత్రి లైట్లు ఆపేసి జగన్ పేరును నగర పాలక సిబ్బంది తొలిగించింది. పోలీసుల సమక్షంలోనే లైట్లు ఆర్పి జగన్ పేరు తొలగించడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2024లో అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) జగన్ ప్రారంభించారు. రూ. 400 కోట్లతో 125 అడుగుల విగ్రహాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు