AP Budget: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ సర్కార్ కసరత్తు

AP: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుంది.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

AP Budget: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుంది. బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నతాధితారులకు ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది.

కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని అంచనాలు పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్టుతో ప్రభుత్వం నెట్టుకొస్తోంది. సూపర్ 6 అమలు పై ఆర్థిక శాఖ బడ్జెట్ లో ఫోకస్ పెట్టనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్ ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు