AP Govt : గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన ప్రారంభించిన ఏపీ సర్కార్! గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది.గ్రామ, వార్డు సెక్రటరీలను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా కసరత్తు చేస్తుంది.కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. By Bhavana 09 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Ward Secretariat System : ఏపీ (Andhra Pradesh) లో మరో వ్యవస్థలో ప్రక్షాళన చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. నిన్నటి వరకు రెవెన్యూ వ్యవస్థ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్...నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీలో మొత్తం 10 వేల 960 గ్రామ సచివాలయాలు, 4 వేల 44 వార్డు సచివాలయాలు ఉండగా...సుమారు లక్షా 61 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సెక్రటరీలను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంతేకాకుండా కొత్తగా క్లస్టర్ (Cluster) విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం కూడా మొదలు పెట్టింది. గ్రామాల్లో ఏఎన్ఎం, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదనలను తీసుకుని వస్తోంది. ఇక పట్టణ పరిధి వార్డుల్లో అడ్మిన్, శానిటరీ, విద్యా, సంక్షేమం, సౌకర్యాలు, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా చర్యలు చేపట్టింది. మిగిలిన సెక్రటరీలను క్లస్టర్ వ్యవస్థలో వివియోగించుకోనున్న ప్రభుత్వం.. గ్రామ సచివాలయ కార్యదర్శులను కూడా పంచాయతీ రాజ్ పరిధిలోకి తీసుకుని వచ్చే ఆలోచనలో ఏపీ సర్కార్ ముందుకు అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీజీ-జనసేన-బీజేపీ కూటమి (TDP-Janasena-BJP Alliance) అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. Also read: భారత్‌కు మరో పతకం..రజతాన్ని కొట్టిన బల్లెం వీరుడు #ap-government #village #cleaning-system మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి