Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీ(AP) లో కాంట్రాక్ట్ ఉద్యోగుల(Contract Employees) కు సీఎం జగన్(CM Jagan) శుభవార్త చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నంబర్ 40,41 జారీ చేశారు స్పెషల్ సిఎస్ కృష్ణబాబు. మరో 397 మందిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 1,977 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ(Medical Health Department) రెగ్యులర్ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా ఇప్పటి వరకు 2,374 మందిని రెగ్యులర్ చేశారు.
CLICK HERE TO VIEW MORE DETAILS
అందరికి సేమ్ పే స్కేల్:
ఐదు రోజుల క్రితం 1,900 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఆరోగ్య శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని సీఎం జగన్ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. జూన్ 2, 2014 (AP విభజన తేదీ) కంటే ముందు కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ఉద్యోగులందరి సేవలు క్రమబద్ధీకరిస్తామన్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణ వల్ల దాదాపు 11,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని అంచనా. రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులందరూ సంబంధిత విభాగాలలోని వారి సహోద్యోగులతో సమానంగా స్కేల్-ఆఫ్-పే పొందుతారు. గత సెప్టెంబర్‌లో జూన్ 2, 2014న లేదా అంతకు ముందు రిక్రూట్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల రెగ్యులరైజేషన్ యాక్ట్, 2023ని అమలులోకి తెచ్చింది.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో వ్యక్తిగత ఉద్యోగులు తమ దరఖాస్తులను దాఖలు చేయడానికి వీలు కల్పిస్తుంది.
Also Read : బెంగళూరు కేఫ్‌లో పేలుడు.. ఎన్‌ఐఏ అదుపులో అనుమానితుడు!