General Administration Department Issue : జూన్ 4న ఏపీ (AP) లో ఎన్నికల ఫలితాలు (Election Results) వెల్లడికానున్న వేళ సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం (Sachivalayam) లో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వశాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రత చూసే ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది సాధారణ పరిపాలక శాఖ. జూన్ 3 తేదీన మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని.. ఆ లోగా వాటిని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.
Also Read : అష్టదిగ్బంధంలో కడప.. వారిపై అధికారుల డేగ కన్ను..