Adala Prabhakara Reddy: వైసీపీ (YCP) కీలక నేతకు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. నెల్లూరు (Nellore) రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల నిలివేసింది. రూ.67 కోట్ల బిల్లులను నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆదాలకు సంబంధించిన ఏపీఆర్‌సీఎల్ కంపెనీ నిజంగా పనులు చేసిందా...? లేదా..? అని అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 16 సంవత్సరాల క్రితం చేసిన పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లించడమేంటని అనుమానం వ్యక్తం చేసింది. కంపెనీపై విజిలెన్స్ విచారణకు టీడీపీ (TDP) నేతల డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే 67 కోట్ల బిల్లు మంజూరు చేస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
Also Read: అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ జారీ