CM Jagan: సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో విచారణకు సిట్ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు సీపీ క్రాంతి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కొరకు ఆరు ప్రత్యేక అధికారుల బృందం రంగంలోకి విచారణ జరుపుతోంది. అజిత్‌సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా మొత్తం ఆ స్థలంలో 20 వేల సెల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జగన్ రూట్ మ్యాప్ లో ఉన్న అన్ని సీసీ టీవీ కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలం వద్ద ఉన్న ఓ స్కూల్ భవనం నుంచి రాళ్లు విసిరారు అని అనుమానంతో ఆ స్కూల్ వాచ్ మెన్ ను అధికారులు విచారిస్తున్నారు. త్వరలో ఈ దాడి ఎవరు చేశారనే దానిపై క్లారిటీ రానుంది.
CM Jagan: సీఎం జగన్‌పై దాడి.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో విచారణకు సిట్ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు సీపీ క్రాంతి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కొరకు ఆరు ప్రత్యేక అధికారుల బృందం రంగంలోకి దిగింది.
New Update
Advertisment