Pension Distribution : వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తం... ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం రూ. 7 వేలు అందించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో ఇంటి వద్దే పింఛన్లు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వం సచివాలయాల (Sachivalayam) సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేయడం కుదరదని కొందరు రాజకీయ నేతలు పేర్కొన్న నేపథ్యంలో...అది సాధ్యమని నిరూపించడానికే పంపిణీలో సచివాలయ సిబ్బందిని చేర్చుతున్నట్లు తెలిపారు. పింఛన్లు అందుకునే వారికి పింఛను తో పాటు ఓ హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ పింఛన్ల (Pension) కార్యక్రమంలో విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.