AP Employees Transfers: ఏపీ ఉద్యోగులకు అలర్ట్.. బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు చంద్రబాబు సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నెల 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Chandrababu Naidu: పోలీసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ నెల 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని పేర్కొంది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అనుమతించింది. రెవెన్యూ, పంచాయితీరాజ్, పురపాలక, గ్రామ, వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.

దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. టీచర్లు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు అనుమతి లేదని వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పని చేసిన ఉద్యోగులు, ఉద్యోగికి లేక వారికుటుంబ సభ్యులకు, ఏదైనా అనారోగ్య కారణాలు ఉంటే బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.

భార్యభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊరు, లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు అవకాశం కల్పించింది. ఉద్యోగ సంఘాల ఆఫీస్‌ బేరర్లకు, తొమ్మిదేళ్లు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. వాటికి సంబంధించిన లేఖలను పరిశీలించిన తర్వాత పరిపాలనపరంగా అవసరమైతే తొమ్మిదేళ్లకు ముందే ఆఫీస్‌ బేరర్లను బదిలీలు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: వైద్య సిబ్బందిపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు