AP High Court: రాజధానిని విశాఖకు తరలించడం లేదు.. హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్‌

ఏపీ రాజధానిని విశాఖకు తరలిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులో కీలక అఫిడావిట్ దాఖలు చేసింది. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.

New Update
AP: పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ

రాజధాని కార్యాలయాలను ప్రస్తుతం అమరావతి నుంచి విశాఖకు తరలించడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆఫీస్ లు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. క్యాంపు ఆఫీస్ ల ముసుగులో రాజధాని తరలిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Elections 2024 : ఎన్నికలకు సిద్ధం అవుతున్న టీడీపీ.. తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు వీరే?

విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వాలని నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆఫీస్ లు తరలించడం లేదని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.

Advertisment
తాజా కథనాలు