AP Exit Polls : కూటమిలో జోష్ నింపిన ఎగ్జిట్ పోల్స్.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు! మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో కూటమి గెలుస్తుందని చెప్పడంతో ఆయా పార్టీల నేతలు సంబరాలకు ఏర్పాట్లు ప్రారంభించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు? మంత్రివర్గంలో ఎంత మందికి ఛాన్స్ ఉంటుంది? పవన్ డిప్యూటీ సీఎం అవుతారా? అన్న చర్చ మొదలైంది. By Nikhil 02 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP - Janasena Leaders Started Celebrations : మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ఏపీ (Andhra Pradesh) లో కూటమి గెలుస్తుందని చెప్పడంతో.. ఆయా పార్టీల నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారంపై సైతం చర్చ ప్రారంభమైంది. అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మూడు పార్టీల కూర్పుతో కేబినెట్ ఉండే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబు కేబినెట్ ఎలా ఉంటుందనే అంశంపై సైతం ఇప్పటి నుండే చర్చ మొదలైంది. వైసీపీ మాదిరిగా నలుగురు డిప్యూటీ సీఎంలను పెడతారా? లేక ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారా? అన్న అంశంపై సైతం ఊహాగానాలు సాగుతున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లుగా కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. కేబినెట్‌లో బీజేపీ (BJP) కి కూడా కీలక శాఖలు దక్కుతాయని.. కేంద్రంలో టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు వస్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి నలుగురు లేదా ఐదుగురికి కేబినెట్ లో ఛాన్స్ దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. BJP నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం వస్తుందన్న టక్ నడుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? అసలు ఫలితాలు ఎలా ఉంటాయి? టీడీపీ నేతల ఆశలు నిజం అవుతాయా? అన్నది తేలాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే! Also Read : నీ సర్వే నిజం అయితే… నాలుక కోసుకుంటా అంటూ ఆరా మస్తాన్ కి బుద్దా ఛాలెంజ్! #tdp-alliance #bjp-janasena-tdp #ap-exit-polls-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి