Nara Lokesh: మరికొన్ని రోజులో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ టీడీపీ నేత నారా లోకేష్ కు మంగళగిరిలో షాక్ తగిలింది. మంగళగిరి, తాడేపల్లి మండలాలలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలో 50 మంది వాలంటీర్లు.. మంగళగిరి మండలంలో 47మంది వాలంటీర్ల రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అధికారులకు అందించారు.
ALSO READ: సీఎం రేవంత్‌కు వరుస ప్రమాదాలు.. కారణమేంటి?.. కుటుంబ సభ్యుల ఆందోళన
రాజీనామా అనంతరం వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ వాలంటరీ వ్యవస్థ ప్రవేశపెట్టారని.. ఐదేళ్లుగా అవ్వా తాతలకు పెన్షన్లు అందజేసినట్లు వాలంటీర్లు తెలిపారు. కుల మత, వర్గ బేధాలు లేకుండా అందరితో కలిసిమెలిసి నవరత్నాలను అందించామన్నారు. వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమను బంధించినట్లు వాపోయారు. ఎన్నికల తర్వాత జగన్ సీఎం అయ్యాక మళ్లీ వాలంటీర్లను నియమిస్తారన్న నమ్మకంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల కుప్పం లో..
సీఎం జగన్ కు మద్దతుగా పెద్దఎత్తున వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా కుప్పంలో చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవోకు అందజేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో మరోసారి జగన్ సీఎం అవుతారని.. అప్పుడు తమను తిరిగి విధుల్లో చేర్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ ను గెలిపిస్తామని వారు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను వాడుకోవద్దని ఇచ్చినా ఇచ్చిన ఆదేశాల వల్ల పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి కొన్ని చోట్ల పెన్షన్ తీసుకోడానికి గ్రామ సచివాలయానికి వెళ్లిన వృద్దులు వడ దెబ్బ తగిలి చనిపోయారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వడం వల్లే ఏపీలో పెన్షన్ పంపిణీకి ఇబ్బంది కలిగిందని వైసీపీ ఆరోపిస్తోంది.