CM Jagan: జగన్‌పై దాడి.. భారీగా భద్రత పెంపు

AP: ఇటీవల సీఎం జగన్‌పై దాడి జరగడంతో ఆయన భద్రతపై పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌కు వ్యక్తిగత సిబ్బందిని భారీగా పెంచింది. బ్రౌన్ కలర్ డ్రెస్‌లో సఫారీ సూట్‌లో అదనంగా జగన్ వెంట 50 మంది వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసింది.

BIG BREAKING : సీఎం జగన్ రాజీనామా
New Update

CM Jagan: సీఎం జగన్ భద్రతపై పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌కు వ్యక్తిగత సిబ్బందిని భారీగా పెంచింది. బ్రౌన్ కలర్ డ్రెస్‌లో సఫారీ సూట్‌లో అదనంగా జగన్ వెంట 50 మంది వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఇటీవల కృష్ణా జిల్లాలో జగన్ పై జరిగిన దాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త వహించింది. జగన్ వెంట ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది నిరంతనం బైనా క్లాస్ లో పరిసరాల ప్రాంతాల ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. భవిష్యత్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ALSO READ: రాహుల్ గాంధీకి అస్వస్థత

అసలేమైంది..

ఈ నెల 13న విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్ కు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి రాయి తగిలింది. రాయి బలంగా తగలడంతో ఆయన ఎడమ కన్ను వాచింది. సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం అయింది.

#cm-jagan #attack-on-cm-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe